ఢిల్లీలోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధులు తెలంగాణ భవన్ గేట్లను బ్లాక్ చేసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. తెలంగాణ భవన్ ఉద్యోగాల నియామకాల్లో న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేసారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా జాబులు మాకే కావాలని, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న తెలంగాణేతర రాష్ట్రాల వారిని వెంటనే తొలగించాలన్నారు. తెలంగాణ రాక ముందు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు, రాష్ట్రం వచ్చాక ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ భవన్‌ను నార్త్ ఇండియా భవన్‌గా మారుస్తున్నారని … తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేసారు. కాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మొత్తం 74 మంది ఉద్యోగులు ఉండగా… అందులో కేవలం నలుగురు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారిలో ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.