రియల్మీ తన కొత్త ఫోన్‌ను ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది..అదే రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ. ఇప్పుడు ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ ధర, ఆఫర్లు..
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.25,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.27,999గానూ నిర్ణయించారు.
అయితే మొదటి సేల్‌లో వీటిపై రూ.1,000 తగ్గింపును అందించారు. అంటే రూ.25 వేలలోపే దీన్ని కొనుగోలు చేయొచ్చు.
డార్క్ మేటర్, హైపర్ స్పేస్, నెబ్యులా బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ పని చేయనుంది.
ఈ ఫోన్లో 6.7 అంగుళాల కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీడబ్ల్యూఎం డిమ్మింగ్ 2160 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్డీఆర్10+ సపోర్ట్, 93.65 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
67W సూపర్‌వూక్ చార్జింగ్‌ను రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ సపోర్ట్ చేయనుంది.
రియల్మీ 10 ప్రో ప్లస్ ద్వారా చార్జింగ్ చేస్తే కేవలం 47 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది.
0 నుంచి 50 శాతం చార్జింగ్ కేవలం 17 నిమిషాల్లోనే ఎక్కనుందని కంపెనీ అంటోంది.
దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే…
ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 4 సెంటీమీటర్ల మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.