బాత్రూంలో జరిగే ప్రమాదాలను నివారించడానికి.. ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందే..!

-

రోజు వారి జీవితంలో ఎన్నో ప్రమాదాల గురించి వింటూ ఉంటాము. అయితే తాజాగా నోయిడాలో ఒక ఇంట్లో టాయిలెట్ పేలడంతో చాలా మంది షాక్ కు గురయ్యారు. ఈ సంఘటనలో, టాయిలెట్ పేలడం వలన ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి కారణం ఇంటి ప్లంబింగ్ వ్యవస్థ మరియు మీథేన్ గ్యాస్ పేరుకుపోవడం అని అందరూ సందేహపడుతున్నారు. ఇంట్లో మురుగు నీరు వంటి వ్యర్ధాలు కాలువలలో కుళ్ళిపోతాయో మీథేన్ అనే మండే వాయువు ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

ఇంట్లో మూసుకుపోయిన కాలువ ఉంటే, టాయిలెట్ బౌల్ లోపల మీథేన్ గ్యాస్ పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి కారణం వల్లన అయినా స్పార్క్ వస్తే ఈ గ్యాస్ పేలుడు సంభవించవచ్చు. అలాగే వెంటిలేషన్ సరిగ్గా లేకుంటే, ఇది తక్కువ సమయంలో మండిపోవచ్చు మరియు ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. అందువల్ల టాయిలెట్ పైపులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. చాలా సంవత్సరాలుగా పైపులను శుభ్రం చేయకపోతే వాటిలో వ్యర్ధాలు పేరుకుపోయి, గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే దానిలో ఒత్తిడి పెరుగుతుందో, పేలిపోయే అవకాశం ఎక్కువ అవుతుంది.

కనుక మురుగు కాలవల్లో మరియు బాత్రూంలో మీథేన్ పేరుకుపోకుండా చూడాలి. ఇలా చేయడం వలన ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానిక మురుగనీటి వ్యవస్థ త్వరగా స్పందించి పరిశీలించింది. అయితే, ఇంట్లో ఏదైనా అంతర్గత సమస్య వలన కూడా పేలుడు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కనుక, ముందుగానే ఎటువంటి లోపాలు లేకుండా పైపులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పేలుడు వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news