ఢిల్లీలో రికార్డ్ స్థాయి మరణాలు

-

రానున్న రోజుల్లో ఢిల్లీలో రోజుకు 15 వేల కొత్త కరోనా కేసులు నమోదు అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 5 నెలల్లో ఢిల్లీలో ఒక్క రోజులో 104 మంది కరోనా వల్ల మరణించడం ఓ రికార్డు అని చెబుతున్నారు. ఆ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రూపొందించిన నివేదికలలో హెచ్చరికలు జారీ  అయ్యాయి. గత 15 రోజులుగా ఢిల్లీలో మొత్తం కరోనా మరణాలు 872 సంభవించగా నవంబర్ 5 నుంచి 10 వ తేదీ వరకు, వరుసగా 66,64,79, 77, 71, 83 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగే కొద్దీ, అదే స్థాయిలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వ తేదీ వరకు ఢిల్లీలో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,572 అయింది.

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ సగటున 80 కరోనా మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పండగ సీజన్ వల్ల కరోనా మార్గదర్శకాలను అక్కడి జనం ఉల్లంఘిస్తున్నారు. ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతున్న వాయు కాలుష్యం, పెరుగుతున్న చలి కూడా  కరోనా కేసుల ఉధృతికి మరో కారణం అని చెబుతున్నారు. ఢిల్లీలో యధేచ్ఛగా మాస్కులు ధరించకుండా యువతీయువకులు నిర్లక్ష్యం యువతపై కరోనా ప్రభావం లేకపోవచ్చు, కానీ, యువత కరోనా వైరస్ కారియర్స్ ఫా పనిచేస్తున్నారని అంటున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 60 వేల  కరోనా నిర్ధారణ పరీక్షలను లక్షకు పైగానే  పెంచాలని కేజ్రీవాల్ నిర్ణయం కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.  

Read more RELATED
Recommended to you

Latest news