దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంటు వ్యాప్తి తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. కాగ పలు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ఎక్కువ ఉన్న సమయంలో పలు కఠిన ఆంక్షలు విధించారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రభావం ఏ మాత్రం లేక పోవడంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆంక్షలను సడలించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా.. ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది.
దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ ముగిసిందని తెలిసింది. ఇక రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు అవసరం లేదని తెల్చి చెప్పింది. రాష్ట్రాల్లో ఆంక్షలు ఉంటే.. తక్షణమే ఎత్తి వేయాలని సూచించింది. నైట్ కర్య్ఫూ తో పాటు.. విద్యా రంగం, ఆధ్యాత్మిక రంగం, క్రీడా, వినోదం వంటి వాటిపై ఎలాంటి ఆంక్షలు ఉన్నా.. వెంటనే తీసివేయాలని తెలిపింది. కాగ దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హొం శాఖ స్పష్టం చేసింది.