ఏపీ రైతులకు మరో శుభవార్త చెప్పింది. జూన్ 15లోపు పంట నష్ట పరిహారం పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రకటన చేశారు. మే 16 న వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. జూన్ 3 వేల ట్రాక్టర్లు సహా 4014 వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారని గుర్తు చేశారు కాకాణీ.
చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీ కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని… అనైతిక పొత్తులతో పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. చంద్రబాబు, కరవు …కవల పిల్లలు అని..చురకలు అంటించారు. ప్రజలంతా ఫర్ గెట్ బాబు అంటున్నారని.. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగా లేదని ఆగ్రహించారు. చంద్రబాబు లాగా జగన్ పన్నులు వేయలేదని.. సంక్షేమ పథకాలు, అభివృద్దిని అడ్డుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోపనలు, వ్యాఖ్యలపై పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.