INTER RESULTS : ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల…ఇలా చెక్‌ చేసుకోండి

-

ఆంధ్ర ప్రదేశ్‌ లో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ…. మే 5 న నిర్వహించాల్సిన పరీక్షలను సుప్రీం కోర్టు ఆదేశాలతో థియరీ పరీక్షలను రద్దు చేశామని గుర్తు చేశారు.

దీంతో ఈ సారి ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థుల అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు జులై 31 లోపు ఫలితాలు ప్రకటించాలని ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. కానీ… సుప్రీం కోర్టు విధించిన గడువుకు వారం ముందే ఇంటర్‌ ఫలితాలు ప్రకటిస్తున్నామని తెలిపారు. కాగా.. ఇటీవలే…ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం… ఇంటర్‌ పరీక్షలతో పాటు.. పదో తరగతి పరీక్షలకు కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ విడుదల చేసిన ఇంటర్‌ పరీక్షా ఫలితాలు ఈ కింది వెబ్సైట్ లలో అందుబాటులో ఉంటాయి.
examresults.ap.ac.in

bie.ap.gov.in

results.bie.ap.gov.in

results.apcfss.in

Read more RELATED
Recommended to you

Latest news