కరీంనగర్ జిల్లా : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. తమ లాంటి వాళ్ళం ఉద్యమం నడిపినం కాబట్టి.. తెలంగాణ రాష్ట్ర కల సహాకారం అయింది తప్ప, కేసీఆర్ ఒక్కడి వల్ల కాలేదని నిప్పులు చెరిగారు. తనను పట్టుకొని అన్ని ఇచ్చామని అంటున్నారని పేర్కొన్న ఈటల.. పీకి పడేస్తే పోతడు కావచ్చు అని కేసీఆర్ అనుకున్నాడని తెలిపారు.
కానీ హుజురాబాద్ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడనే విషయం కేసీఆర్ మరిచాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఓటుకు 10 వేలు ఇచ్చిన నాయకులకు వెల కట్టిన ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది తానేనని వెల్లడించారు. దళితుల నుండి ఒక్క ఓటు వచ్చే తట్టు లేదని కేసీఆర్ గమనించాడని… దళితులను గోల్ మాల్ చేసేందుకు దళిత బంధు పెట్టాడని నిప్పులు చెరిగారు. దళిత బంధు కూడా హుజరాబాద్ వరకు మాత్రమేనని పేర్కొన్నారు. చదువుకోని తల్లి దండ్రుల మీద భారంగా ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్త చేశారు. 2023లో ఎగిరే జెండా బిజేపి జెండా అని..తాను ప్రజల పక్షాన ఆత్మ గౌరవ బహుట ఎగురవేసానని తెలిపారు.