ఇలా చేస్తే మీ ఇంట్లో బొద్దింకలు మాయం అవుతాయి…!

-

వేసవి వచ్చిందంటే చాలు ఇంట్లోకి బొద్దింకలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వంట గది లో, బాత్రూంలో ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. వీటిని ఇళ్లలోంచి తరమడానికి ఎన్నో పద్ధతులను ట్రై చేస్తూ ఉంటారు. అయినా సరే ఆ పద్ధతుల వల్ల ఉపయోగం లేదా..? ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇంట్లో ఉండే పిల్లలకి, పెంపుడు జంతువులకు హాని చేస్తాయి. దీని కోసం మీరు కెమికల్ లేని పద్ధతులను అనుసరించడం ముఖ్యం. అందుకోసమే మీకు కొన్ని టిప్స్. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుంచి బొద్దింకలు దూరమవుతాయి.

కిరోసిన్:

కిరోసిన్ ని ఉపయోగించడం వల్ల ఆ వాసనకి బొద్దింకలు వెళ్లిపోతాయి. కిరోసిన్ లో కొద్దిగా నీళ్ళు కలిపి బొద్దింకలు ఎక్కువగా ఉన్న ప్రదేశం లో స్ప్రే చెయ్యండి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు అక్కడ ఉండవు.

బిర్యానీ ఆకు:

బిర్యాని ఆకు నుంచి వచ్చే వాసన వల్ల కూడా ఇవి పారిపోతాయి. ఎక్కువగా బొద్దింకలు సంచరించే ప్రదేశం లో ఈ ఆకుల్ని చితక్కొట్టి ఉంచడం వల్ల ఆ ఘాటైన వాసనకి బొద్దింకలు వెళ్లిపోతాయి.

లవంగం:

లవంగాలు కూడా ఘాటయిన ఫ్లేవర్ కలిగి ఉంటాయి. వీటిని కూడా మీరు బొద్దింకలు సంచరించే ప్రదేశంలో పెడితే బొద్దింకలు పారిపోతాయి. బొద్దింకలకి ఘాటయిన వాసన నచ్చదు. ఎక్కువగా బొద్దింకలు కనుక మిమ్మల్ని బాధిస్తుంటే ఈ పద్ధతిని మీరు ఉపయోగించండి. దీనితో బొద్దింకలు మీ ఇంట్లో సంచరించవు.

Read more RELATED
Recommended to you

Latest news