జబర్దస్త్ ఫైమాకు బిగ్​బాస్​లో రెమ్యునరేషన్​ ఎంతో తెలిస్తే షాక్!

-

బిగ్​బాస్ కోసం జబర్దస్త్​ ఫైమా తీసుకుంటున్న రెమ్యునరేషన్​ గురించి ఓ వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో తెలుసుకుందాం.

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్‌ మరో సీజన్‌ మొదలైపోయింది. ఇప్పటివరకూ అయిదు సీజన్లు పూర్తి చేసుకున్న ‘బిగ్‌బాస్‌’ మరింత ఎంటర్‌టైన్‌ చేయడానికి 6వ సీజన్‌తో అడుగుపెట్టింది. గత మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు. 15 వారాల పాటు సాగనున్న ఈ సీజన్​లో ఈసారి హౌస్‌లోకి మొత్తం 21మంది కంటెస్టెంట్‌లు వెళ్లారు. వీళ్లలో జబర్దస్త్​ ఫేమ్​ ఫైమా. 17వ కంటెస్టెంట్​గా హౌస్​లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫైమా ఓ సూపర్ కమెడియన్. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షోలో నటించి ఓ రేంజ్‌లో పాపులారీటీ తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే ఫుల్​ క్రేజ్​ తెచ్చుకున్న ఈ అమ్మాయి.. డబుల్​ మీనింగ్​లో పంచ్ వేస్తే ఎలాంటి వారైనా కడుపుబ్బ నవ్వాల్సిందే.

అయితే తాజాగా ఆమె రెమ్యురనేషన్​ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆమెకు వారానికి దాదాపు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా, బిగ్​బాస్​ తొలి రోజు స్టేజ్​పై ఆమె.. కమెడియన్ ప్రవీణ్​తో ప్రేమలో ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది. 35 ఏళ్లుగా తమ కుటుంబం అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పింది. రీసెంట్‌గానే తన ఫ్యామిలీకి ఇల్లు కట్టించి ఇచ్చానని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news