చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కచ్చితంగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది. అయితే మరి ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా దీని కోసమే పూర్తిగా చూసేయండి. సరైన జీవన విధానం లేకపోవడం వలన ఎన్నో సమస్యలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. ముఖ్యంగా ఒబిసిటీ చాలా మందిలో ఉంటోంది. ఒకవేళ కనుక మీరు బరువు త్వరగా తగ్గాలంటే కచ్చితంగా వీటిని మీ డైట్ లో తీసుకోండి. ఈ ఆహారపదార్థాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
ఓట్స్:
40 గ్రాముల ఓట్స్ లో 148 క్యాలరీలు ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా దీని వల్ల ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
గుడ్లు:
బరువు తగ్గడానికి గుడ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. అల్పాహారం సమయంలో గుడ్లు తినడం వల్ల బరువు త్వరగా తగ్గచ్చు.
పాప్ కార్న్:
ఆకలి బాగా వేసినప్పుడు ఏదైనా ఆహారానికి బదులుగా పాప్ కార్న్ తీసుకోవడం మంచిది దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
యోగర్ట్:
ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బీ ట్వెల్వ్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కాల్షియం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఆపిల్స్:
బరువు తగ్గడానికి ఆపిల్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయి. కడుపు నిండుగా ఉంచడానికి కూడా ఇది సహాయపడుతుంది పైగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక బరువు త్వరగా తగ్గచ్చు.