బెల్లంకొండ సినిమాతో ప‌వ‌న్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ

-

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో విడాకులు త‌ర్వాత రేణు దేశాయ్ కొత్త జీవితాన్ని ప్రార‌భించిన సంగ‌తి తెలిసిందే. పిల్ల‌లిద్ద‌రితో క‌లిసి మ‌హారాష్ట్ర‌లో ఉంటోంది. ఓ వ్యాపార‌వేత్త‌తో రెండ‌వ పెళ్లికి రెడీ అయింది. ఇప్ప‌టికే ఎంగేజ్ మెంట్ తంతు ముగించింది. అతి త్వ‌ర‌లోనే వివహ బంధంతో ఒక‌టి కానున్నారు. ఇదే స‌మ‌యంలో రేణు మ‌ళ్లీ సినిమాల్లోకి మ‌ళ్లీ న‌టిగా రీ ఎంట్రీ ఇస్తుంద‌న్న వార్త కొన్ని నెల‌లుగా వినిపిస్తోంది. మొద‌ట్లో ఇది ప్ర‌చార‌మే అనుకున్న ఆమె మాట‌ల్లో సినిమాల‌పై ఆస‌క్తి క‌నిపించింది. తాజాగా అందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. దీనిపై మ‌రింత అప్ డేట్ అందింది. బెల్లంకొండ‌ సాయి శ్రీ‌నివాస్‌ క‌థానాయ‌కుడిగా వంశీ కృష్ణ ఆకేళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

Renu Desai Re Entry In Bellamkonda srinivas Movie

ఇంద‌లో రేణు ఓ ముఖ్య పాత్ర‌కు సైన్ చేసిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ఈ సినిమాకు స్టార్ రైట‌ర్ సాయి మాధ‌వ్ బుర్రా డైలాగులు అందిస్తున్నారు. ఆయ‌న రేణు దేశాయ్ పేరు సూచించ‌డంతోనే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ముంబై వెళ్లి రేణును ఒప్పించిన‌ట్లు స‌మాచారం. క‌థ‌లో రేణు పాత్ర కూడా కీల‌కంగా ఉంటుంద‌ని , అందువ‌ల్లే చిన్న సినిమా అయినా ఒప్పుకుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బెల్లంకొండ రాక్ష‌సుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అనంత‌రం అన్ని వివ‌రాలు మేక‌ర్స్ వెల్ల‌డించ‌నున్నార‌ని తెలుస్తోంది. కానీ రేణు ఎంట్రీ ఇంత సింపుల్ గా ఉంటుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు.

ప‌వ‌న్ మాజీ భార్య‌గా తెలుగులో ఆమెకు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ప‌వ‌న్ తో విడిపోయినా ఇంకా ఒదిన‌మ్మ‌గా భావించే అభిమానులెంద‌రో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె ఎంట్రీ ఓ పెద్ద మూవీతోనే ఉంటుంద‌ని భావించారు. కానీ అన్ ఎక్స్ పెక్టెడ్ గా చిన్న సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌డం అనేది కాస్త నిరుత్సాహానికి గురిచేసే వార్తే. ఒక‌ప్ప‌డు ప‌వ‌న్ భార్య‌గా కీర్తి ప్ర‌తిష్టలు ద‌క్కించుకున్నా..ఇప్పుడు నిరాడంబ‌రంగా ఉండాల్సిన స‌న్నివేశం వ‌చ్చింది. బ‌ళ్లు ఓడ‌లవ్వ‌డం… ఓడ‌లు బ‌ళ్లు అవ్వ‌డం అంటే ఇదేనేమో.

Read more RELATED
Recommended to you

Latest news