రాష్ట్రంలో రక్షణ కరువు…. తెలంగాణ ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ గా మారింది- రేణుక చౌదరి

-

తెలంగాణ రాష్ట్రంలో రక్షణ కరువైందని.. కిడ్నాప్, హత్యలు మామూలు అయిపోయామని ఆరోపించారు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి. ల్యాండ్ డీల్స్ కు తెలంగాణ కేంద్రంగా మారిందని ఆమె అన్నారు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. ధరణి పోర్టర్ సృష్టించిన ఇబ్బందుల వల్ల రైతులు నష్ట పోతున్నారని.. ఎప్పుడో అమ్మిన భూముల యాజమాన్య హక్కులు మారడం లేదని విమర్శించారు. దీంతో రియల్ ఎస్టేట్ మాఫియా రైతులపై దౌర్జన్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. తెలంగాణ స్టార్టప్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. టెక్నాలజీ మంచిదే కానీ అదే టెక్నాలజీ ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తుందని.. ఇలా అయితే అందరూ కిడ్నాప్ లు ,మర్డర్ లు చేస్తారని విమర్శించారు. గతంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు కూడా తప్పుల తడకే…అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రేణుక చౌదరి.

అమరావతి రైతులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా అని.. అమరావతిలో న్యామం గెలిచిందని ఆమె అన్నారు. రైతుల పోరాటంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. రైతుల పాదయాత్రని దేవుడు కరుణించాడని.. తిరుపతి వెంకన్న, కనకదుర్గ ఆశీస్సులు అమరావతి రైతులకు ఉన్నాయని రేణుక చౌదరి అన్నారు. అమరావతిపై హైకోర్ట్ తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news