తెలంగాణలో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు…అసలు ఏం జరుగుతుంది?

-

ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలు ఒకలా నడిచాయి..ఏదో రాజకీయంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వార్ నడిచింది..ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది..సరే రాజకీయంగా వార్ జరగడంలో తప్పుడు లేదు..కానీ ఆ వార్ కాస్త హత్య రాజకీయాల వైపు వెళుతుంది…అది కూడా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యాక…రాజకీయం పూర్తిగా మారిపోయింది.

కరెక్ట్‌గా గమనిస్తే…2019 ఎన్నికల ముందు ఏపీలో వైసీపీకి పీకే వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే…అప్పుడు జగన్‌పై కోడి కత్తి దాడి, జగన్ సొంత బాబాయి వివేకా హత్య జరిగింది..ఇక వీటికి కారణం అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీనే అని చెప్పి వైసీపీ ఆరోపణలు చేసి ఎన్నికల్లో లబ్ది పొందిన విషయం తెలిసిందే. అసలు కోడి కత్తి దాడి, వివేకా హత్య ఎలా జరిగిందో జనాలకు ఇప్పుడుప్పుడే క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు..అయితే అప్పుడు పీకే స్క్రిప్ట్ ప్రకారమే అంతా నడిచిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇక ఇప్పుడు పీకే తెలంగాణలో టీఆర్ఎస్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు..ఇదే సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిందని చెప్పి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు…వారు కూడా హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించామని ఒప్పుకున్నారు. 2017 నుంచి తనని చంపేందుకు ప్రయత్నం చేశారని, తనని, తన కుటుంబాన్ని శ్రీనివాస్‌గౌడ్ టార్గెట్ చేశారని, శ్రీనివాస్‌గౌడ్ నుంచి ప్రాణ హాని ఉందని, వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాస్‌గౌడ్‌ను చంపాలనుకున్నా అని రాఘవేంద్రరాజు పోలీసుల స్టేట్‌మెంట్‌లో చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసిన వారికి బీజేపీ నేతలు డీకే అరుణ, జితేంద్రరెడ్డి సాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి…ఇదే క్రమంలో అరుణ ఇంటిపై కొందరు దాడి చేశారు. ఈ కేసుల వెనక పీకే సలహా ఉందని, సీఎం కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్‌ల కుట్ర ఉందని, శ్రీనివాస్ గౌడ్ మీద హత్యకు కుట్ర అనేది పచ్చి అబద్ధం అని అరుణ అంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పోరాటం చేస్తే ఎవరికైనా తాము షెల్టర్ ఇస్తామని, శ్రీనివాస్ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కొందరు వ్యక్తులు ఈసీకి ఫిర్యాదు చేశారని, ఈ విషయాన్ని మంత్రి తట్టుకోలేకపోయాడని అరుణ చెబుతున్నారు.

ఇక ఈ విషయంపై జితేందర్ రెడ్డి కూడా ఫైర్ అవుతున్నారు… ఎలాంటి మచ్చలేని తనపై విపరీత ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకపోతే న్యాయవిచారణ జరిపించాలని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ నాయకత్వానికి వివరిస్తున్నామని చెప్పారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని అంటున్నారు. మొత్తానికి ఇదంతా పీకే స్క్రిప్ట్ అని విశ్లేషకులు అనుమానించే పరిస్తితి..మరి చూడాలి తెలంగాణలో ఇంకెన్ని ట్విస్ట్‌లు వస్తాయో?

Read more RELATED
Recommended to you

Latest news