ట్రంప్‌తో సరదాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. కూతురు ఆద్యా కూడా..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రది సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన బెంగాలీ బ్యూటీ రేణు దేశాయి, ఆ తరువాత పవన్‌ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమజీవితం కొనసాగించిన వారిద్దరు, పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట ఆ తర్వాత అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ మరో విదేశీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. రేణు దేశాయ్ మాత్రం అఖీరా, ఆధ్యల బాగోగులు దగ్గరుండి చూసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులకి అందుబాటులో ఉంటూ.. ఎప్పటికప్పుడు తన గురించిన విషయాలను తెలియజేస్తుంది రేణు దేశాయ్.

తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. తన పెంపుడు కుక్క పిల్ల పేరు ట్రంప్ అని, అయితే ఆ పేరుకు దాని ప్రవర్తనకు పోలిక లేదని, చాలా మంచిగా ప్రవర్తిస్తుందని ఓ ఫోటోకు ఫోజుఇచ్చింది. అలాగే కుక్క పిల్లతో తన కూతురు ఆద్యా ఫోటోను కూడా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అవి కాస్త వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news