ఆ ప్రశ్నలే ఆహా అన్ స్టాపబుల్ షో కొంప ముంచాయా..!!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటే ఇక వచ్చే ఎపిసోడ్స్ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్,  మొదటి ఎపిసోడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో ట్రెండింగ్ లో హల్చల్ చేసింది. అందుకే ఆహా టీం వారు తెలివిగా ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు ఎపిసోడ్స్ గా చేశారు

ఇక రెండో ఎపిసోడ్ కు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన గోపి చంద్ ను కూడా పిలిచారు.వాస్తవానికి రెండో ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంటుందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. కాని ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను అంతగా అలరించ లేదని తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ లో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలు సగం వరకు ఉండగా మళ్లీ గోపిచంద్ తో మళ్లీ అవే ప్రశ్నలు అడిగి షో ను బోర్ కొట్టేలా చేశాయని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కూడా పెళ్ళి ప్రశ్నలు తోనే ముడి పడి ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news