అన్నవాహిక క్యాన్సర్‌ను నయం చేయగల శక్తి వయాగ్రాకు ఉందంటున్న పరిశోధనలు..

-

వయాగ్రా ఎందుకు వాడతారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే అందుకే కాకుండా ప్రమాదకర వ్యాధిని తగ్గించానికి కూడా వయాగ్రా నెంబర్‌ వన్‌గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు తగ్గించడంలో సహాయపడుతోందని పరిశోధకులు కనుగొన్నారు. వయాగ్రాలో కనిపించే ఫాస్ఫోడీస్టేరేస్ టైప్ 5(PDE5) అనే రసాయనం అన్న వాహికలో కనిపించే కణితులని తగ్గిస్తుంది.

ఈ చిన్న మాత్ర క్యాన్సర్ చికిత్స కీమోథెరపీని మరింత ప్రభావవంతంగా పని చేసేలా చేస్తుందని అధ్యయనంలో తేలింది.. ఇది ఇతర క్యాన్సర్లని చంపడానికి కూడా సహాయపడుతుందని అంటున్నారు. యూకేలో ప్రతి సంవత్సరం సుమారు 79000 మంది అన్న వాహిక క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. కేన్సర్‌ బారిన పడిన వారు ఐదేళ్లకు మించి బతికే అవకాశం 20 శాతం మాత్రమే ఉంటోంది.. అన్నవాహిక క్యాన్సర్ నోటిని కడుపుతో కలిపే మార్గానికి సోకుతుంది. ఈ వ్యాధికి ఇతర క్యాన్సర్లతో పోలిస్తే చాలా తక్కువ చికిత్స ఉంటుంది. పైగా ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో 80 శాతం మంది కీమోథెరపీకి కూడా స్పందించడం లేదని పరిశోధనలో తేలింది.

వయాగ్రా ఎలా పనిచేస్తుంది..

వయాగ్రాలోని PDE 5 క్యాన్సర్ కణితి వృద్ధి చెందకుండా చేస్తుంది. సౌతాంప్టన్ బృందం ల్యాబ్‌లోని క్యాన్సర్ కణాలపై, ఎలుకలపై PDE5 నిరోధక మందులను పరీక్షించారు. వయాగ్రా వాడిన ప్రతి 75 కేసులలో కీమోథెరపీ ప్రభావవంతంగా ఉందని నిపుణులు తెలిపారు..

వయాగ్రా ఎంత వరకు పని చేస్తుందనే దాని మీద ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు.. ప్రస్తుతం ఎలుకల మీద పరీక్షిస్తుండగా త్వరలోనే మానవుల మీద కూడా పరీక్షలు ప్రారంభించాలని బృందం తెలిపింది..ఇది విజయవంతం అయితే ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి చికిత్స చేయవచ్చు. ఇతర వ్యాధులకి పని చేసే మందులు క్యాన్సర్ చికిత్సకు కూడా ప్రభావవంతంగా ఉంటాయా లేదా అనే దాని మీద మరింత పరిశోధనలు చెయ్యడానికి ఆసక్తిగా ఉన్నామని నిపుణుల బృందం వెల్లడించింది.

అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు..

బరువు తగ్గడం
ఆహారం మింగడం కష్టంగా మారడం
రొమ్ము ఎముక నొప్పి
గొంతు బొంగురు పోయి దగ్గు రావడం
అజీర్ణం, గుండెల్లో మంట
ఎక్కువగా ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం

ఈ వ్యాధి చివరి దశకి చేరితే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం. క్యాన్సర్ కణితి పరిమాణాన్ని బట్టి పొట్టలో కొంత భాగం తొలగించాల్సి కూడా వస్తుందని వైద్యులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news