ఆ స్కూల్లో పిల్లలు అస్సలు మాట్లాడుకోరు..ఎందుకో తెలుసా?

-

మాములుగా స్కూల్లో పిల్లలు అందరు కలిసి మెలిసి ఉండాలని అంటారు.. ఎవరితో గొడవలు పడకుండా సరదాగా ఉంటారు.. కానీ విచిత్రమేంటంటే.. సాధారణంగా స్కూల్ వాతావరణం అంటేనే విద్యార్థులతో కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ చదువుతో పాటు ఆట పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.పిల్లలకు మంచి స్నేహం అనేది ఇక్కడినుండే వెలువడుతుంది. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వున్న కొన్ని స్కూళ్లలో మాత్రం చిత్ర, విచిత్రమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. తోటి విద్యార్థులతో స్నేహం చేయకూడదు, వాష్ రూమ్‌కు ఎక్కువసార్లు వెళ్ళకూడదు, చప్పట్లు కొట్టకూడదు.. ఇలా ఎన్నోరకాలైన వింత నిబంధనలు వున్నాయి. ఇపుడు వాటి గురించి తెలుసుకుందాం..

 

 

 

 

 

 

 

 

విషయానికొస్తే..బ్రిటన్‌లో ఓ స్కూల్ యాజమాన్యం విచిత్రమైన రూల్ జారీ చేసింది. అదేమిటంటే ఇక్కడ విద్యార్థులు తమ తోటి విద్యార్థులతో స్నేహం చేయకూడదు. విచిత్రంగా వుంది కదూ. దీనికి కారణం ఏమనుకుంటున్నారు? స్నేహితుల నుంచి విడిపోయినప్పుడు విద్యార్థులు ఒంటరినైనట్లుగా ఫీల్ అవుతున్నారని.. అందుకే స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఫ్రెండ్‌షిప్‌ను నిషేధించామని స్కూల్ యాజమాన్యం చెప్పడం కొసమెరుపు. ఇక సాధారణంగా ఏ స్కూల్‌లోనైనా వాష్ రూమ్‌కు వెళ్లడంపై ఎలాంటి పరిమితులు ఉండవు. అయితే అమెరికాలోని చికాగో నగరంలో ఉన్న ఎవర్‌గ్రీన్ పార్క్ హై స్కూల్‌లో విద్యార్థులు వాష్‌రూమ్‌కి వెళ్లడంపై పరిమితి విధించారు.

పిల్లలు సమయాన్ని వృథా చేయకుండా ఉండేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం చెప్పుకొచ్చింది. అలాగే చాలా మంది పిల్లలు తమ స్నేహితులను కలిసినప్పుడు హగ్ చేసుకోవడం, ఉత్సాహంతో చప్పుట్లు కొట్టడం వంటివి సహజం. బ్రిటన్, అమెరికాలోని అనేక స్కూల్స్‌లో చప్పట్లు కొట్టడం, తోటి విద్యార్థులను హగ్ చేసుకోవడం వంటి వాటిని నిషేధించారు..అలాగే ప్రముఖ నగరం అయిన జపాన్ లో విద్యార్థుల జుట్టు ఎంత పొడవు ఉండాలి.. గోర్ల సైజ్ ఎంత ఉండాలో స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. మన దేశంలో ఇలాంటి రూల్స్ మాత్రం లేవు..ఉనింటే చాలా మంది చదువును మానేసేవారు..

Read more RELATED
Recommended to you

Latest news