తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిాంచింది. అయితే తాజాాగా బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. గతంలో బార్ల కేటాయింపు అంశంలో రిజర్వేషన్లు లేవు. బార్లకు ఎవరైనా టెండర్ వేయవచ్చు. లక్కీ డ్రా ద్వారా ఎవరికైనా బార్ లైసెన్స్ వచ్చే అవకాశం ఉండేది. ఇటీవల బార్ల కేటాయింపులో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా రిజర్వేషన్లు వర్తింపు చేయనున్నారు. ప్రస్తుతం బార్లకు టెండర్ టైం దగ్గర పడుతోంది. అక్టోబర్తోనే పాత లైసెన్సుల గడువు ముగియాలి. కానీ కరోనా కారణంగా రెండుసార్లు లాక్డౌన్ రావడంతో బార్ల నిర్వహకులకు కొంతమేర లాస్ ఏర్పడింది. దీంతో గడువును మరో నెల అనగా నవంబర్ వరకు పొడగించింది. కొత్తగా బార్లలో రిజర్వేషన్లు కల్పిస్తే వెనుకబడిన తరగతుల వారీకి సరైన అవకాశాలు రావడంంతో పాటు బార్ లైసెన్సుల్లో ఉన్న గుత్తాధిపత్యానికి తెరపడే అవకాశం ఏర్పడుతుంది.
వైన్స్ లతో పాటు … బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు- మంత్రి వెల్లడి
-