ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 24 మంది మంత్రులు నిన్న సీఎం జగన్ ఆదేశాలతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11 వ తేదీన జరడబోయే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు అనుగూణంగా 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు అందించారు. కాగ ఈ రాజీనామా లేఖలు నేడు గవర్నర్ ఆమోదం కోసం.. రాజ్ భవన్ కు చేరాయి. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్.. 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించే అవకాశం ఉంది.
అంతే కాకుండా.. రాష్ట్రంలో 24 మంత్రి పదవులు ఖాళీ అయినట్టు గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ గెజిట్ విడుదల చేయనున్నారు. రాజీనామాలు ఆమోదం పొందిన వెంటనే.. రాజీనామా చేసిన మంత్రుల వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోనుంది. అలాగే మంత్రులు ఉండే.. కార్యాలయాలు కూడా ఖాళీ చేయనున్నారు. దీంతో పాటు రాజీనామా చేసిన మంత్రుల సిబ్బంది కూడా రిలీవ్ ఆర్డర్లు తీసుకోనున్నారు. కాగ కొత్త కేబినెట్.. ఈ నెల 11 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.