అమరావతి : నేడు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. నంద్యాలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఉదయం 9.35 కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు కు వెళ్లనున్నారు. పదకొండున్నర కు నంద్యాలకు చేరుకోనున్న సీఎం జగన్… జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించనున్నారు.
అనంతరం బహిరంగసభలో పాల్గొననున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి కి చేరుకోనున్న జగన్… 2021–22 విద్యా సంవత్సరానికి జగనన్న వసతి దీవెన రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా 10,68,150 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ర 1,024 కోట్లు వర్చువల్ గా జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. కాగా.. నిన్న ఏపీ మంత్రులు అంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.