సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్బిఐ…!

-

కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతుంది. కరోనా వైరస్ విస్తరించడం తో అన్ని రంగాలు మూత పడ్డాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆర్ధిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏ స్థాయిలో కట్టడి చేసినా కరోనా మాత్రం కట్టడి అవ్వడం లేదు. ఆర్ధికంగా బలంగా ఉండే దేశాలు కూడా కరోనా వైరస్ తీవ్రతకు ఇబ్బంది పడి ఆర్ధికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపధ్యంలో మన దేశ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే ఏ దేశం తీసుకొని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాతో పాటు, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొని కార్యకలాపాలు నిర్వహించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేస్తూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. బిజినెస్ కంటిజెన్సీ ప్లాన్(BCP)లో భాగంగా వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడం రిజర్వ్ బ్యాంకు చరిత్రలో ఇదే తొలి సారి కావడం విశేషం.

ఈ వార్ రూమ్ లో 90 మంది ఉద్యోగులు సేవలు అందిస్తారు. ఈ నెల 19 నుంచే దీని కార్యకలాపాలు ప్రారంభ౦ కాగా దీనిని ఒక్క రోజులోనే ఏర్పాటు చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఆర్ధిక పరిస్థితి చక్క దిద్దడానికి గానూ… కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుందని, దానికి ఆర్ధిక మంత్రి నాయకత్వం వహిస్తారని మోడీ ప్రకటించారు. ఆర్బిఐ తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news