పరేడ్ గ్రౌండ్స్‌కు పర్మిషన్ ఇవ్వకుంటే ఎల్బీ స్టేడియంకు వెళ్తాం : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో పోటీ పోటీగా కార్యక్రమాలు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌కు పర్మిషన్ ఇవ్వకుంటే ఎల్బీ స్టేడియంకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్‌ సభ నిర్వహణ అనుమతికి సెప్టెంబరు 2న డిఫెన్స్ ఆఫీసర్లు లేఖ ఇచ్చామన్నారు. కానీ కాంగ్రెస్‌కు ఇవ్వొద్దనే ఉద్దేశ్యంతో బీజేపీ, బీఆర్ఎస్‌లు కుట్రలకు పాల్పడుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కుట్రదారులుగా మారడం దారుణమన్నారు.

No alliance with BRS as long as I am TPCC president, says Revanth Reddy

ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండవ అప్షన్‌గా ఎల్బీ స్టేడియంను అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అక్కడా పర్మిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపేలా కనిపించడం లేదన్నారు. అవసరమైతే ఔటర్ బయట కొంగర కలాన్, ఇతర ప్రదేశాలలో సభ ఏర్పాటు చేసుకునేందుకు అల్టర్నేట్ ప్లాన్ చేస్తున్నామన్నారు. లీడర్లు, కార్యకర్తలు సభ ఎక్కడ పెట్టినా.. సక్సెస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ పిలుపునిచ్చారు.

అయితే.. హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా పోటాపోటీ కార్యక్రమాలకు కాంగ్రెస్‌, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. అయితే, వేదిక విషయంలో మరోసారి పార్టీల మధ్య మాటలయుద్ధం మొదలైంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోనే హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. గతేడాది పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బీజేపీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 16న, 17 తేదీల్లో వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 17న భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news