సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వట్లేదని నిరూపించేందుకు తాను సిద్ధమని, KTR ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ’24 గంటల విద్యుత్ను సింగిల్ ఫేజ్ ఇస్తున్నట్లు ట్రాన్స్కో సీఎండీ గతంలో చెప్పారు. రైతులకు త్రీ ఫేజ్ విద్యుత్‌పై నియంత్రణ పాటిస్తున్నట్లు, 8-10 గంటలే ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. సాగు కోసం ఎవరూ సింగిల్ ఫేస్ మోటార్లు ఉపయోగించరు’ అని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 8 నుంచి 12 గంటల విద్యుత్ మాత్రమే వస్తోందన్నారు. 24 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇస్తే రూ. 16 వేల కోట్లు ఖర్చు అవుతాయని..కానీ 24 గంటల కరెంట్ సరఫరా మీద కేసీఆర్. రూ. 8 నుంచి రూ. 9 వేల కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు.
ఉచిత కరెంట్ పై చర్చకు మంత్రి కేటీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సిద్దిపేట, సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత గ్రామం..ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా రైతు వేదికలో 24 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరాపై మంత్రి కేటీఆర్ చర్చకు రావాలన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాపై ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించాలన్నారు. 9 ఏండ్ల ప్రభుత్వ పాలనపై అన్నదాతలు, ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పేరు మీద 30 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.