తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వందలాది మంది VRAలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే… ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లయి ఓవర్ దగ్గర 200 మంది VRA లను అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే.. అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పోలీసులు.. నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి మల్లిస్తున్నారు. దీంతో VRA ల ఆందోళన ఉదృతం అయింది.
ఈ నేపథ్యంలో వీఆర్ఏలను అరెస్టు చేయడాన్ని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ” వీఆర్ఏలది అర్థం లేని ఆందోళన అయితే.. మీది నరం లేని నాలుక నా కేసీఆర్!? 2020 సెప్టెంబర్ 9న ఇదే అసెంబ్లీలో వారికి పే స్కేల్ ఇస్తాం, పదోన్నతులు ఇస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా! తాజాగా వీఆర్ఏల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి”. అని ట్విట్ చేశారు రేవంత్ రెడ్డి.
వీఆర్ఏలది అర్థం లేని ఆందోళన ఐతే… మీది నరంలేని నాలుకనా కేసీఆర్!?
2020 సెప్టెంబర్ 9న ఇదే అసెంబ్లీలో వారికి
పే స్కేల్ ఇస్తాం, పదోన్నతులు ఇస్తాం అని హామీ ఇచ్చింది మీరు కదా!తాజాగా వీఆర్ఏల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. pic.twitter.com/Whiwg0i5YZ
— Revanth Reddy (@revanth_anumula) September 13, 2022