లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమే : కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

-

తెలంగాణ రాజకీయాల్లో ఛాలెంజ్‌ ల పర్వం కొనసాగుతోంది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు నేపథ్యం లో… తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. డ్రగ్స్‌ టెస్టు లకు నువ్వు సిద్ధమా ? అంటే నువ్వు సిద్ధమా అన్న రీతిలో ఇద్దరూ నేతలు రెచ్చిపోతున్నారు.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR
రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

ఈ నేపథ్యం లో తాను డ్రగ్స్‌ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమేనని… రాహుల్ గాంధీ కూడా వస్తే తాను ఎయిమ్స్ దాకా రావడానికి అయిన రెడీ అని ఇవాళ ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ ట్వీట్‌ పై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని…. మాతో పాటు కేసీఆర్ కూడా సహారా, ఈఎస్ఐ స్కాంల‌లో లై డిటెక్టర్ టెస్టుల‌కు రావాలని సవాల్‌ విసిరారు రేవంత్ రెడ్డి. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news