కరీంనగర్ జిల్లా గంగధర మండలం మధురానగర్ లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసేది పాదయాత్ర కాదని.. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసింది పాదయాత్ర అని అన్నారు. రేవంత్ రెడ్డి చేసేది బస్సు యాత్రన లేక పాదయాత్రనా అనేది జనానికి తెలుస్తలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టును అభివృద్ధి చేశాం అంటుందని.. ఏం అభివృద్ధి చేశారో రేవంత్ రెడ్డి శ్వేత పత్రాం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొండగట్టు కి వేయి కోట్లు కేటాయించిన గోప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. టిడిపిలో ఉన్నప్పుడు సోనియా గాంధీ బలి దేవత అన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే రవిశంకర్.
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి తోత్తుగా, బినామిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బస్సులో పాదయాత్ర చేస్తున్నాడని.. ఈ పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కొండగట్టుకి ఒక్క రూపాయి కూడ తీసుకురాలేదని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరిగిందన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.