ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు రేవంత్‌రెడ్డి ని టీపీసీసీ ప్రెసిడెంట్ గా చేస్తే ఆయన్ను వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నేతలే రాజనామాలు చేయడం, విమర్శలు చేయడం చాలా దుమారమే రేపుతోంది. ఇప్పటి వరకు ఒక్క కీలక నేత కూడా రేవంత్‌ను స్వయంగా కలిసి విషెస్ చేయకపోవడం సంచలనం రేపుతోంది. దీంతో ఆయన్ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే రాజీనామాలు షూరూ అయ్యాయి.
ఇక తనకు అండగా ఉంటారనుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా ఆయన్ను వ్యతిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కేఎల్ ఆర్, మర్రి చెన్నారెడ్డి లాంటి కీలక నేతలు రాజనామాలు చేయడం సంచలనం రేపుతోంది. మరి కొందరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ లో మొదలైన ప్రకంపనలు, రాజీనామాలు బీజేపీకి ప్లస్ అవుతాయని చర్చ జరుగుతోంది. రాజీనామాలు చేసిన వారంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికార పార్టీ అయితే టీఆర్ఎస్‌లోకి వెళ్లినా అక్కడ పెద్దగా గుర్తింపు ఉండదనే భావనతో బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీలోకి వెళ్తే గుర్తింపు దక్కుతుందని వారు చూస్తున్నారు. మొత్తానికి రేవంత్ ఎఫెక్ట్ బీజేపీకి కలిసొస్తోందన్న మాట.