రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా వసూళ్లు చేస్తోంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా వసూళ్లు చేస్తోందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచి అధిక స్థానాల్లో గెలిపించారని అన్నారు. బీజేపీ ప్రజలు 35 శాతానికి పైగా ఓట్లు వేస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం ఒక శాతం మాత్రమే ఓటు పర్సంటేజ్ పెరిగిందన్నారు.

అనేక స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని ధ్వజమెత్తారు. లోక్ సభ ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉండాలని ప్రజలే భావిస్తున్నారని అర్ధం అవుతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై మెల్లగా వ్యతిరేకత వస్తుందని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ సారి 8 స్థానాలు గెలుచుకుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news