కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి.. పతనం ఖాయం: ఈటల

-

కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకొని అమలుకు సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ గుప్పించిందని అన్నారు. ప్రతి మహిళకు రూ.2500 ఇవ్వడం ఎలా సాధ్యమో అర్ధం కాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూడా ఇలాగే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి.. అమలు చేయలేకపోయారని అన్నారు.

దేశంలో అతివేగంగా అప్పు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ అని, దళితులకు మూడెకరాలు అని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని, దళితబంధు, రైతుబంధు అని ఇలా అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని.. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ పయనిస్తోందని అన్నారు. ప్రజలు కేసీఆర్కు ఇచ్చిన ఫలితమే వచ్చే ఎన్నికల్లో అంతకు రెండితలు కాంగ్రెస్కు ఇవ్వడం ఖాయమన్నరు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే హవా అన్నారు. తెలంగాణలోని మెజార్టీ సీట్లలో జెండా ఎగరేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news