అక్కడా రేవంత్ రెడ్డికి చుక్కెదురు.. పిటిషన్‌ కొట్టవేత

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు మళ్లీ హైకోర్టుకు (Telangana Highcourt) వచ్చి చేరింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఐదుగురు సాక్షులను ఒకే సారి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడానికి అవకాశం కల్పించాలని రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని దాఖలు చేసిన పిటిషన్లను గతంలో హైకోర్టు కొట్టివేసింది. దీనిపై రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఇదే కేసులో సండ్ర వెంకటవీరయ్య వేసిన పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

Revanth Reddy, father of the iron leg!

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షలు ఇవ్వజూపిన కేసును ఎదుర్కొంటున్నారు. రూ.50 లక్షలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఏసీబీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ ఆయన తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Latest news