కేసీఆర్ ను ఢిల్లీ పిలిచి సన్మానం…

కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. కెసిఆర్ సలహాలు మోడీ శబాష్ అన్నాడట అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇంకా నయం…ఢిల్లీకి పిలిచి సన్మానం చేస్తా అన్నాడు అని చెప్పుకోలేదు అని మండిపడ్డారు. కెసిఆర్ కి తెలివి ఉంటే… వ్యాక్సిన్ ఇక్కడే తయారీ చేస్తున్నప్పుడు తెలంగాణ అవసరం అయిన మేరకు అందించిన తర్వాతే బయట రాష్ట్రాలకు ఇస్తాం అని ఎందుకు చెప్పలేదు కెసిఆర్ అని నిలదీశారు.

ఒరిస్సా..తమిళనాడు లు వాళ్ల అవసరాల కోసం ఆక్సిజన్ వాడుకోగా మిగిలినది బయటకు పంపిస్తున్నారు అని అన్నారు. కెసిఆర్ ఎందుకు వ్యాక్సిన్ నీ ముందు మాకు ఇచ్చి తర్వాత మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వండి అని మోడీకి ఎందుకు చెప్పడం లేదు అని నిలదీశారు.