షర్మిల పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

Join Our Community
follow manalokam on social media

వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగా షర్మిల పెట్టబోతున్న పార్టీకి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. వైఎస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందిని అంత మాత్రాన షర్మిల పార్టీ పెడితే ప్రజలు అంగీకరించరని ఆయన అన్నారు. తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికి రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ… రాజన్న బిడ్డగా ఏలుకోవడానికి కాదు అని రేవంత్ అన్నారు. రాజన్న బిడ్డగా సారె పెట్టి పంపుతా కానీ, పార్టీ పెడితే ప్రజలు ఆమోదించరని ఆయన అనారు.

షర్మిలకు తన అన్నతో పంచాయితీ ఉంటే అక్కడ చూసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చుడేంది అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఇక సీఎం అయ్యేది లేదు అని అందుకే కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణంలా షర్మిల వచ్చిందని రేవంత్ అనారు. పులిచింతల, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పై షర్మిల వైఖరి చెప్పాలని తెలంగాణ ప్రజల జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డి పాడు, సంగమేశ్వరం పై కోర్టులో కేసు వేసి రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ వద్దు… సమైక్యరాష్ట్రం ముద్దు అన్నారు కదా… చనిపోయిన బిడ్డలకు ముందు క్షమాపణ చెప్పండని రేవంత్ కోరారు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...