డ్రగ్స్‌ టెస్ట్‌ కోసం ఇవాంక ట్రంప్ కావాలా ?: కేటీఆర్‌ కు రేవంత్‌ చురకలు

రేవంత్‌ రెడ్డి మరియు మంత్రి కేటీఆర్‌ ల మధ్య సవాళ్ల పర్వం తగ్గేలా కనిపించడం లేదు. డ్రగ్స్‌ టెస్ట్‌ పై మరోసారి కేటీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి. డ్రగ్ టెస్టు కు రా అని నేను అడిగానా… నువ్వు అడిగావా..!?… కేటీఆర్‌ చెప్పిన దాన్నే తాను స్వీకరించానని తెలిపారు. మరో ఇద్దరికి సవాల్ విసిరానని… గన్ పార్క్ కి అర గంట ముందే కేటీఆర్ వస్తా రు అనుకున్నా… కానీ రాలేదన్నారు.

రాహుల్ గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్… ఇవాంక ట్రంప్ ను కూడా రమ్మని అడుగుతారేమో ? అంటూ చురకలు అంటించారు రేవంత్‌. రాణా మరియు రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ పిలిచింది.. వాళ్ళను అంటుంటే… కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని నిప్పులు చెరిగారు. కేసులు వేస్తం అని బెదిరిస్తున్నారని…. కేటీఆర్..నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. కేటీఆర్.. ఎమ్మెల్యే కాకముందే.. తాను ఎమ్మెల్సీ అయ్యానని… రాజకీయంగా పోల్చితే కేటీఆర్‌… వెంట్రుకతో సమానమని వివాద్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్ గా మారిపోయాడని తెలిపారు.