కోకాపేట భూముల వేలంపై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు

-

రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌.. బీనామీలకే భూములు కట్టబెట్టారని ఫైర్‌ అయ్యారు.  కోకపేట భూముల్లో 3 వేల కోట్ల ఆదాయం రావాల్సింది… 2 వేల కోట్ల ఎలా వచ్చిందని ప్రశ్నించిన రేవంత్‌… రియల్ ఎస్టేట్ గురించి తనకు తెలుసు అని పేర్కొన్నారు. 50 అంతస్థుల బిల్డింగులు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందని సంచలన ఆరోపణలు చేశారు.

భూముల అమ్మకాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని…ప్రభుత్వమే .. తన భినామీలకు భూములు అమ్మకానికి పెట్టిందని ఫైర్‌ అయ్యారు. 60 కోట్లకు అమ్ముడు పోయినా భూములు తప్ప… మిగిలిన భూములకు స్విస్ ఛాలెంజ్ ద్వారా టెండర్ పిలవాలి కెసిఆర్ కి విజ్ఞప్తి చేశారు రేవంత్‌. దోపిడీలో మీ పాత్ర లేకుంటే… స్విస్ ఛాలెంజ్ విధానం లో భూముల అమ్మకానికి పెట్టాలని డిమాండ్‌ చేశారు.

రాజ్ పుష్ప ఎన్ని ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారో త్వరలో బయట పెడతానని…కలెక్టర్ వెంకట్రామరెడ్డి పై గతంలో సీబీఐ విచారణ నివేదిక ఉందని తెలిపారు. వెంకట్రామరెడ్డి రాజ్ పుష్ప పేరుతో ఎన్ని వెంచర్లు వేశారు.. ఏం చేశారు అనేది బయట పెడతానని హెచ్చరించారు. 50 ఎకరాలు అమ్మితే 2000 కోట్లు వస్తే… ఎకరా 28 గుంటలు 60 కోట్లకు ఎలా అమ్ముడు పోయిందని ప్రశ్నించారు. మిగిలిన భూమి 45 కోట్లకు ఎలా అమ్ముడు పోయిందని నిలదీశారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామి రెడ్డి… బడా కంపెనీలు రావొద్దని బెదిరించాయని… గండిపేట చెరువు దగ్గర్లో ఉన్న భూమి..నిర్మాణాలకు అనుమతి ఉండదు అని బెదిరించారని ఆరోపించారు. కెసిఆర్ … దగ్గరి వాళ్ళకే అమ్మకానికి భూములు పెట్టారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news