తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుడిగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని మంగళవారం సాయంత్రం నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో సోమేశ్ కుమార్ మూడేళ్లపాటు కొనసాగనున్నారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సోమేశ్ కుమార్ నియామకంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సోమేశ్ కుమార్ కి ఇచ్చిన ఆర్డర్ చూసి ఆశ్చర్యం వేసిందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి మళ్లీ పదవి ఏంటని ప్రశ్నించారు భట్టి. ఈ రాష్ట్రంపై ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి..? అని నిలదీశారు. సోమేష్ కుమార్ ని వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.