హైదరాబాద్ రోడ్ల వెంట పరుగులెత్తిన రెవెన్యూ సిబ్బంది !

హైదరాబాద్ లో ఎక్కడిక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తమకు వరద పరిహారం అందలేదని బాధితులు సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో తమకు నష్టపరిహారం అందించాలంటూ అధికారుల వెంటపడ్డారు బాధితులు. అయితే ఒక్కసారిగా అక్కడున్న అందరూ వెంట పడడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు రెవెన్యూ అధికారులు.

తమ చుట్టు పక్కల ఉన్న వారికి ఇచ్చి తమకు మాత్రం నష్ట పరిహారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. మరో చోట కూడా రెవెన్యూ సిబ్బంది పంపిణీ కి రాగా..అక్కడ కూడా వారి వెంట పడడంతో అధికారులు అక్కడినుంచి వెనుదిరిగి వెళ్ళిపోయరు. దీంతో తమకు నష్టపరిహారం అందించాలంటూ రోడ్డు పై బైఠయించారు భాదితులు. దీంతో పోలీసులు వారి వివరాలు తీసుకుని..అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామి ఇచ్చారు.