ప్రపంచంలో తొలి ఎస్ఎంఎస్ వేలం… భారీ ధర పలికిన వైనం..

-

ప్రపంచంలో ఏదైనా మొదటిది అయితే దానికుంటే క్రేజే వేరు. టెక్నాలజీ అయినా, ఆవిష్కరణ, ఫ్యాషన్ కు సంబంధించింది అయినా తొలుత మొదలైందంటే దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. వాటిని వేలం వేస్తుంటారు. దీనికి అనుగుణంగానే అవి ఆకర్షనీయమైన ధర పలుకుతుంటాయి. ఇది వరకు ఇలా వేలంలో కళ్లు చెదిరే ధరలు పలకడం మనం ఇంతకుముందు కూడా చూశాం. అయితే తాజాగా ప్రపంచంలో తొలి ఎస్ఎంఎస్ ను వేలం వేసింది.. టెలికమ్యూనికేషన్ దిగ్గజం వోడాఫోన్. అసలు ప్రపంచంలో తొలి ఎస్ఎంఎస్ ఏమిటో తెలుసా.. ’మెర్రీ క్రిస్మస్‘ అనే రెండు అక్షరాల పదం. ఇప్పుడు ఈ రెండు అక్షరాల పదమే రికార్డ్ ధర పలికింది.

గత వారం ప్రపంచ తొలి ఎస్ఎంఎస్ ను వేలానికి పెట్టగా.. 1,07,000 యూరోల ధర పలికింది. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 91 లక్షలు అన్నమాట. ఈ ఎస్ఎంఎస్ ను ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంక్షేమానికి ఇవ్వనున్నట్లు ఓడాఫోన్ తెలిపింది. 1992 డిసెంబర్ 3న వోడాఫోన్ ఇంజనీర్ నీల్ పాల్ వర్త్ తన కంప్యూటర్ ద్వారా తొలి ఉద్యోగి రిచర్డ్ జార్విస్ కార్డ్ లెస్ ఫోన్ కు ఈ ఎస్ఎంఎస్ పంపించాడు. ఈ ఎస్ఎంఎస్ తరువాత నోకియా తన ఫోన్లలో ఎస్ఎంఎస్ సెండింగ్, రిసీవింగ్ టెక్నాలజీని రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news