కేటీఆర్‌ కు షాక్‌ : రేవంత్ వైట్‌ ఛాలెంజ్ స్వీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డీ

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పరస్పర ఛాలెంజ్‌ లతో వేడేక్కాయి. మంత్రి కేటీఆర్‌ వైట్‌ ఛాలెంజ్‌ కు రావాలని రేవంత్‌ రెడ్డి నిన్న సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. తాను వైట్ ఛాలెంజ్ సిద్దమని .. కెటిఆర్ కి వైట్‌ ఛాలెంజ్ విసురుతున్నానని పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. అంతేకాదు… తాను రక్త నమూనాలు ఇస్తానని… ఆ తర్వాత విశ్వేశ్వర రెడ్డీ మరియు కేటీఆర్ ఇవ్వాలన్నారు.

revanth-reddy-konda vishweshwar reddy

ఈ ఛాలెంజ్‌ కు ఇద్దరూ సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యం లో రేవంత్‌ రెడ్డి ఛాలెంజ్‌ పై కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి… స్పందించారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నానని తెలిపారు. రేపు గన్ పార్క్ కి వస్తానని స్పష్టం చేశారు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగి పోయిందని… యువత పేడ తోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని పై తెలంగాణ సర్కార్‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news