తెలంగాణలో కాంగ్రెస్ ను ముంచేందుకు దిగుమతిచేసుకున్న నేత రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ సీనియర్లు దీనిపై ఆలోచించుకోవాలి అన్నారు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన గువ్వల బాలరాజు… గతంలో రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ విసిరారని, ఇప్పుడు రాహుల్ తో వెంట్రుక శాంపిల్ ఇప్పించగలడా? అని సవాల్ విసిరారు.దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈ సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు బాలరాజు. ఇంతకు ముందు రేవంత్ రెడ్డిని రైఫైల్ రెడ్డి అని పిలిచేవారని, ఇక నుంచి వెంట్రుక రెడ్డి అని పిలవాల్సి వస్తుందని గువ్వల బాలరాజు ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి లాంటి దొంగ చేతికి పిసిసి వెళ్లిందని, అతడు టీ కాంగ్రెస్ తో పాటు రాహుల్ గాంధీని కూడా మంచే చేస్తాడు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాటలు నిజమైతే రాహుల్ గాంధీ పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. చైనా అంబాసిడర్ తో రాహుల్ ఉన్నది నిజమే అని రేవంత్ రెడ్డి అంటున్నారని, కాదు అని కాంగ్రెస్ వేరే నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి మాటలు అబద్ధం అయితే పిసిసి అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు.