వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ..ట్వి్ట్టర్ వేదికగా ప్రతీ విషయమై తన అభిప్రాయాలను ట్వీట్ చేస్తుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై న వర్మ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. వివరాల్లోకెళితే..దివంగత లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి సభకు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరివెన్నెల గొప్పతనం గురించి వివరించారు.
ఈ క్రమంలోనే సినిమా వాళ్లకు పలు సూచనలు ఇచ్చారు. సినిమాలు విజ్ఞానం పెంచే విధంగా ఉండాలని, అజ్ఞానాన్ని తొలగించాలని అన్నారు. అశ్లీలత, అసభ్యత కాదని, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వీలయినంత వరకు మానేయాలని, అసలు మీనింగ్ చెప్పాలని తెలిపారు. ఇక ఫిల్మ్ మేకర్స్ అందరూ తమ కుటుంబ సభ్యులతో తాము తీసిన సినిమా చూసుకుని ఒక ఒపీనియన్ కు రావాలని తాను సూచించినట్లు వివరించారు వెంకయ్య. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను జోడించి రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
‘‘ఓహో..అవునా? ఫెంటాస్టిక్.. ఇంతటి గొప్ప సూచనను ఇచ్చినందుకు థాంక్యూ సర్..ఇటవంటి సూచనను నేను ఎప్పుడూ వినలేదు’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు ఆర్జీవీ. RGV ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వెంకయ్య నాయుడు చెప్పిన దాంట్లో తప్పు ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు అయితే దమ్ముంటే ఈ ట్వీట్ ను ఉప రాష్ట్రపతి ఆఫీస్ కు ట్యాగ్ చేయి అని అంటున్నారు. మొత్తంగా వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు.
https://t.co/8BZMWeckuu oho ? alaaga? Avuna? Fantaaasticccc ..Thank u for the extraordinary never before heard advise sirrrrrr🙏🙏🙏🙏🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2022