దక్షిణాఫ్రికా(South Africa)లో అల్లర్ల కారణంగా మరణించిన వారి సంఖ్య 72 కి చేరుకుంది. మాజీ అధ్యక్షుడి జైలు శిక్షతో నెలకొన్న అశాంతిని అరికట్టడానికి పోలీసులు మరియు మిలిటరీ స్టన్ గ్రెనేడ్లు మరియు రబ్బరు బుల్లెట్లను కాల్చడం జరిగింది. రెండు ప్రావిన్సులలోని 1,200 మందికి పైగా అరెస్టు చేయబడ్డారు. ఇక మరిన్ని వివరాలని చూస్తే..
కొన్ని కోవిడ్ -19 టీకా కేంద్రాలు మూసివేయబడ్డాయి. అలానే గౌటెంగ్ మరియు క్వాజులు-నాటల్ ప్రావిన్సులలో చాలా మంది మరణించడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటంటే..? వేలాది మంది ప్రజలు ఆహారం, విద్యుత్ పరికరాలు, మద్యం మరియు బట్టలని షాపుల నుండి దొంగిలించారు. ఈ విషయాన్నీ మాథపెలో పీటర్స్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
అలానే క్వాజులు-నాటాల్ ప్రావిన్స్‌లో 27, గౌటెంగ్ ప్రావిన్స్‌లో 45 మరణాలను విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎటిఎం మెషీన్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు పేలుళ్ల వల్ల సంభవించిన మరణాలపై, అలాగే కాల్పుల వల్ల సంభవించిన మరణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలియజేయడం జరిగింది.
ఇది ఇలా ఉంటే నిరుద్యోగులకు తగినంత ఆహారం లేదని మేము అర్థం చేసుకున్నాము. మహమ్మారి వల్ల పరిస్థితి మరింత ఘోరంగా మారిందని మేము అర్థం చేసుకున్నాము, అని మఖురా రాష్ట్ర దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తో అన్నారు.
కానీ ఈ దోపిడీ ఇక్కడ మా వ్యాపారాలను బలహీనపరుస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థను, మన సమాజాన్ని బలహీనం చేస్తోంది అని తెలిపారు.