రేవంత్ రెడ్డి ఆట మొదలెట్టారు..హుజురాబాద్ ఉప ఎన్నిక ఇంచార్జులు వీరే…!

-

హైదరాబాద్: కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ చందరంగం మొదలుపెట్టారు. ఇటీవల పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత హుజూరాబాద్‌లో వస్తున్న తొలి ఉపఎన్నికను రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీని ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. హుజురాబాద్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి ఇంఛార్జులు కూడా నియమించారు.

హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నేత అయిన దామోదర రాజనర్సింహని నియమించారు. ఇక సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌లు వ్యవహరించనున్నారు. వీణవంక మండల ఇన్‌చార్జ్‌లుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్‌ను, జమ్మికుంట మండల ఇన్‌చార్జ్‌లుగా విజయరమణారావు, రాజ్ ఠాగూర్, జమ్మికుంట టౌన్ ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎంపీ రాజయ్య, ఈర్ల కొమురయ్యను, హుజురాబాద్ మండల ఇన్‌చార్జ్‌లుగా టి.నర్సారెడ్డి, లక్ష్మణ్‌ కుమార్‌ను, హుజురాబాద్ టౌన్ ఇన్‌చార్జ్‌లుగా బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు, ఇల్లంతకుంట మండల ఇన్‌చార్జ్‌లుగా నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిను, కమలాపూర్ మండల ఇన్‌చార్జ్‌లుగా కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యను నియమించారు. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా సరే గెలవాలని వీళ్లకు రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలని రేవంత్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news