ప్రధాని రేసులో రిషి సునాక్ వెనుకంజ.. ఇక గెలుపు కష్టమే..!

-

మన తెలుగింటి అల్లుడు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పాలిస్తాడనే ఆశ ఇక కల కాబోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ల మధ్య పోరు దాదాపు తుది దశకు చేరుకుంది. వచ్చే వారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు పంపిణీ కానున్నాయి. అయితే తదుపరి ప్రధానిగా సునాక్‌ కంటే లిజ్‌ ట్రస్‌కు అవకాశాలు గణనీయంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పోటీలో గెలుపు 90శాతం ఆమెనే వరించే అవకాశాలున్నాయని స్థానిక బెట్టింగ్ ఎక్స్ఛేంజ్‌ సంస్థ స్మార్కెట్స్‌ అంచనా వేసింది.


“ప్రధాని రేసులో ఫైనల్‌గా వీరిద్దరూ(సునాక్, ట్రస్) మిగిలినప్పుడు ట్రస్‌కు విజయావకాశాలు 60-40గా ఉన్నాయి. అయితే ఆ తర్వాత పరిణామాలు ఆమెకు అనుకూలంగా మారుతూ వచ్చాయి. పోటీ మొదలైనప్పటి నుంచి రిషి సునాక్‌ గెలుస్తారని చాలా మంది అంచనా వేశారు. అయితే డిబేట్లలో ట్రస్‌ ప్రసంగాలు ఈ అంచనాలను అధిగమించాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ట్రస్‌కు 90శాతం విజయావకాశాలు ఉండగా.. సునాక్‌ గెలుపు అవకాశాలు 10 శాతానికి తగ్గాయి” అని స్మార్కెట్స్‌ పొలిటికల్‌ మార్కెట్స్‌ హెడ్‌ మాథ్యూ షాడిక్‌ తెలిపారు.

పలు వివాదాల్లో కూరుకుపోయిన బోరిస్‌ జాన్సన్‌ ఈ నెల 7వ తేదీని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ప్రక్రియ చేపట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి, తద్వారా ప్రధాని పదవికి ఎన్నిక మొదలవ్వగా.. ఇందుకోసం తొలుత 11 మంది పోటీ పడ్డారు. అనేక రౌండ్ల అనంతరం తుది రేసులో మాజీ ఆర్థిక మంత్రి సునాక్‌, మాజీ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news