మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆలయాలకు ఒక ప్రత్యేకత ఉంది.. ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొలువై ఉంది.దక్షిణభారతదేశంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రాలలో ఒకటిగా, అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు కోరిందే తడవుగా వారికోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మతల్లి..ఈ అమ్మవారి శక్తీ పీఠము లలో ఒకటి.. ఇక్కడి అమ్మవారు స్వయంభుగా వెలసారని పురాణాలు చెబుతున్నాయి.పూర్వ కాలంలో కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేసాడు.
అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడుగగా అమ్మా..నువ్వు ఎప్పుడూ నా హృదయస్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే.. నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వతరూపుడవై వుండు.నేను కృతయుగంలో అసురసంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాలను కబళిస్తున్న మహిషుణ్ణి వధించి కీలుడుకిచ్చిన వరం ప్రకారం మహిశావర్ధిని రూపంలో కీలాద్రిపై వెలసింది..
ప్రతీరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తర్వాత ఇంద్ర కీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలని ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుడ్ని గురించి శతాస్వమేగ యాగం చేసాడు.సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి,కదంబ పుష్పాలతో పూజించటం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని గాధ. మరో గాధ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాసుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పై వుగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించటానికి శివుడు కిరాకుడుగా వచ్చి అర్జునునితో మల్లయుద్ధం చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాసుపతాశ్త్రాన్ని అనుగ్రహించాడు.
మహారౌద్రంగా వున్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేసారు. అప్పట్నుంచీ అమ్మ పరమశాంతస్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తారు.దేవీ నవరాత్రులు ఇక్కడ ఫెమస్..అప్పుడు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ దసర తొమ్మిది రోజులు వివిధరకాల అలంకారాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు..విజయవాడ నుండి ఇతర ముఖ్య పట్టణాలకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి బస్సులు నడపబడుచున్నవి. వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి.రైలు మార్గం, విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడూ అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతునే ఉంటాయి.. మీరు ఎప్పుడైనా విజయవాడకు అక్కడ అమ్మవారిని దర్శించుకోండి..