చివరి నిమిషంలో నన్ను సినిమా నుండి తీసేసారు… ప్రముఖ బాలీవుడ్ నటి..!

-

అందాల ముద్దుగుమ్మ రితభరి చక్రవర్తి నేక్‌డ్‌ అనే బాలీవుడ్ మూవీ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను తీసుకు వచ్చింది. అందులో భాగంగా ఆ తర్వాత రితభరి చక్రవర్తి ‘పరి’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న రితభరి చక్రవర్తి తాజాగా బ్రోకెన్‌ ఫ్రేమ్‌ అనే షార్ట్‌ ఫిలిం తో పాటు ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఓ హిందీ సినిమాతో తిరిగి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో రితభరి చక్రవర్తి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.


‘పరి’ మూవీ తర్వాత దానిని మించిపోయే పాత్రలు మాత్రమే చెయ్యాలి అని అనుకున్నాను. ఆ క్రమంలో ఎన్నో అవకాశాలను చేజేతులారా పోగొట్టుకున్నాను. ఒక సందర్భంలో సినిమా ఓకే అయ్యాక అందులో నుండి నన్ను తీసేసారు. ఆ మూవీ లో నేను మురికివాడలో నివసించే అమ్మాయిగా కనిపించడం కోసం 12 కిలోలు తగ్గాను. కానీ చివరి నిమిషంలో ఆ దర్శకుడు మమ్మల్ని సినిమా నుండి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకున్నాడు. చాలా బాధగా అనిపించింది అని రితభరి చక్రవర్తి తాజా ఇంటర్వ్యూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news