ఇది కేవలం ఎన్నికల స్టంట్ : ఆర్‌ కృష్ణయ్య

-

హైదరాబాద్ కాచిగూడలో బిసి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ తన హామీలతో బీసీలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం, కేబినెట్ సమావేశం లో బీసీ కులవృత్తులు చేసుకొనే వారికి లక్ష రూపాయలు రుణాలు ఇస్తున్నట్లు తెలిపారని … ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని ఆయన హేళన చేశారు. ఇంతకుముందు కూడా ఎన్నికల సమయంలో ఇలాగె రుణాలు ఇస్తామని.. 5 లక్షల 77 వేల మంది నుంచి అప్లికేషన్లు తీసుకొని పెండింగ్లో పెట్టారని ఆర్ క్రిష్నయ్య వెల్లడించారు.

బీసీ బంధు కోసం తాము పోరాటాలు చేస్తే… త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఇప్పటి వరకు ఇప్పటివరకు దానిని అమలు చేయలేరని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కువ పన్నులు కడుతున్న బీసీలను పాలకులు బిక్షగాళ్లుగా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బీసీ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నారని… తన వైఖరి మార్చుకోవాలని అన్నారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీలు తనకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య .

Read more RELATED
Recommended to you

Latest news