సినీ నటుడు కత్తి మహేశ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

-

నెల్లూరు: సినీ నటుడు కత్తి మహేశ్‌కు ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కొడవలూరు మండలం చంద్రశేఖరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఇక స్వల్ప గాయాలైన కత్తి మహేశ్ నెల్లూరు మెడికల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఏమీ లేదని, భయపడాల్సిన అవసరం లేదని కత్తి మహేశ్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కత్తి మహేశ్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. లారీ డ్రైవర్‌ను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news