ఈ ఒక్క బ్లడ్ టెస్ట్ తో లక్షణాలు కనపడక ముందే 50 రకాల క్యాన్సర్స్ ని గుర్తించచ్చు..!

ఈ ఒక్క బ్లడ్ టెస్ట్ తో 50 రకాల క్యాన్సర్లని లక్షణాల కంటే ముందే గుర్తించొచ్చు. సాధారణంగా బ్లడ్ టెస్ట్ లో మనకి కొంత పరిమిత వరకే సమాచారం లభిస్తుంది. అయితే ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా 50 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Galleri అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా 50 రకాల క్యాన్సర్లని లక్షణాలు కంటే ముందుగా గుర్తించ వచ్చని మల్టీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కి ఇది అవసరమయ్యే సమాచారం ఇస్తుందని సైంటిస్టులు అంటున్నారు.

తాజాగా కాలిఫోర్నియా యుఎస్ఏ లో వుండే Grail దీనిని తీసుకు వచ్చింది. అయితే ఇది యునైటెడ్ స్టేట్స్ లో అందుబాటులో ఉంది. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ టెస్ట్ చేయించుకోవాలి అని నిపుణులు అంటున్నారు.

అయితే ఇది 50 రకాల క్యాన్సర్లను ఒక్క బ్లడ్ టెస్ట్ లోనే గుర్తిస్తుందని.. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ లో 134,000 మంది పాల్గొనడం జరిగింది. క్యాన్సర్ సిగ్నల్ డిటెక్ట్ అవ్వగానే ఈ టెస్ట్ బాడీ పార్ట్స్ లో ఎక్కడ క్యాన్సర్ ఉంది అనేది కూడా పిన్ పాయింట్ చేసి చూపిస్తుంది.

డాక్టర్ జోషువా చీఫ్ మెడికల్ ఆఫీసర్ మరియు హెడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీని వల్ల డయాగ్నసిస్ లో ముందు ముందు బాగా ఉపయోగపడుతుందని.. చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.

మామూలుగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా చాలా రకాల క్యాన్సర్లు కనుక్కోలేము. ముఖ్యంగా లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటివి తలుచుకోవడం అవ్వదు. అయితే ఇటువంటి ఉపయోగించడం వల్ల ముందుగానే వీటిని కనుక్కొని లైఫ్ ని సేవ్ చేయొచ్చు అని అన్నారు.