ఏంది సారు… ’బండి’ని జాకీలు వేసి లేపుతున్నారు!

-

మరి రాజకీయంగా బీజేపీకి చెక్ పెట్టాలని చేస్తున్నారో లేక.. పరోక్షంగా బీజేపీని పైకి లేపాలని చేస్తున్నారో తెలియదు గాని.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళుతుంది. మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా మూడోసారి అధికారంలోకి రావడానికి పనిచేస్తున్న కేసీఆర్‌కు బీజేపీ రూపంలో పెద్ద గండం ఎదురయ్యేలా ఉంది. బీజేపీతో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది.

ఇప్పటికే బీజేపీ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతుంది. కేసీఆర్‌ని దెబ్బకొట్టి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ స్థాయిలో దూకుడు కనబరుస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.. అనూహ్య రీతిలో ఆయన టీఆర్ఎస్‌కు ఎక్కడకక్కడ చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బండి దూకుడు వల్లే బీజేపీ ఇంకా పికప్ అయిందని చెప్పొచ్చు. ఒకవేళ పార్టీపై ప్రజల్లో పాజిటివ్ ఉన్నా సరే, బండి లాంటి దూకుడు లేకపోతే త్వరగా ప్రజల్లోకి వెళ్ళడం కష్టం.

అందుకే బండి సంజయ్.. బీజేపీకి అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా ఉన్నారు. ఇక ఈ ప్లస్‌ని మైనస్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల వల్ల.. టీఆర్ఎస్‌కు ఒరిగేది ఏమి లేకపోగా, అనూహ్యంగా బండికే ప్లస్ అవుతుంది. మామూలుగా ఆయనని అలా వదిలేసిన ఇబ్బంది ఉండేది కాదేమో.. కానీ బండిని అణచివేయాలని చెప్పి, ఆయనని టార్గెట్ చేసుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు.

ఇటీవల దీక్ష చేస్తున్న బండిని అరెస్ట్ చేయించారు.. అంతకముందు ఆయనపై రాళ్ళ దాడి చేశారు. అలాగే ఎక్కడకక్కడే ఆయనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. తాజాగా ఎంపీ అరవింద్‌పై రాళ్ళ దాడి చేశారు. ఈ విషయంపై కూడా బండి సీరియస్‌గా ఉన్నారు. అయితే బండిని ఎక్కడకక్కడ ఆపాలని చెప్పి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ, ఇంకా పైకి లేపుతుంది. అంటే టీఆర్ఎస్ ఎంత ఆపాలని చూస్తే బండి అంత పైకి లేచేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news